బిగ్ బాస్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన యంగ్ హీరో దంపతులు
- July 22, 2019
బుల్లి తెర మీద బిగ్ బాస్ సందడి మొదలైంది. రొమాంటిక్ హీరో కింగ్ నాగార్జున హోస్ట్‌గా ఆదివారం రాత్రి 9 గంటల నుంచి మూడో సీజన్ స్టార్ట్ అయింది. 15 మంది కంటెస్టెంట్ల తో 100 రోజులపాటు ఈ షో ఆడియన్స్ కి వినోదం పంచనుంది. మూడో సీజన్ లో కంటెస్టెంట్ ల ఎంట్రీ చూస్తుంటే తొలి రెండు సీజన్ లో బీట్ చేసేలా కనిపిస్తోంది.
‘కింగ్’ మూవీలోని సాంగ్ తో బిగ్ బాస్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. ఫస్ట్ మరియు సెకండ్ సీజన్ లకు వ్యాఖ్యాతలుగా.. బిగ్ బాస్ షో ని రక్తికట్టించిన తారక్, నాని లను గుర్తుచేసుకున్నారు నాగర్జున. నా పెద్ద కొడుకు తారక్. ఇక నాని ‘నా గోల్డ్’ అంటూ వారిని పొగడ్తలతో ముంచెత్తారు. తరువాత హౌజ్‌లోకి వెళ్లిన నాగార్జునకు.. బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. మొత్తం 15 మంది కంటెస్టెంట్లలో మొదటి ముగ్గురినీ సెలక్ట్ చేయాలని నాగార్జునకు సూచించారు బిగ్ బాస్. దీంతో మూడు చిట్టీలను తీసి ముగ్గురు కంటెస్టెంట్లను నాగార్జున సెలక్ట్ చేశారు. ఈ ముగ్గురిలో ఫస్ట్ యాంకర్ శివజ్యోతి అలియాస్ ‘తీన్మార్’ సావిత్రిని బిగ్ బాస్ వేదికపైకి పిలిచారు. ఆ తరవాత సీరియల్ నటుడు రవికృష్ణను సెకండ్ కంటెస్టెంట్‌గా.. సోషల్ మీడియా సెన్సేషన్, నటి అశురెడ్డిని థర్డ్ కంటెస్టెంట్‌గా ఆహ్వానించారు. నాల్గొవ కంటెస్టెంట్ గా జర్నలిస్టు జాఫర్‌ను పరిచయం చేశారు. ఐదో కంటెస్టెంట్‌గా నటి హిమజ బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టింది. 14 మరియు 15 వ కంటెస్టెంట్లుగా వచ్చిన యంగ్ హీరో వరుణ్ సందేశ్, ఆయన సతీమణి వితికా షెరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
బిగ్ బాస్ కంటెస్టెంట్ ల జాబితా:
1. శివ జ్యోతి అలియాస్ తీన్మార్ సావిత్రి ….. 2. రవికృష్ణ … 3. అశురెడ్డి … 4. జాఫర్ … 5. హిమజ …. 6. రాహుల్ సిప్లిగంజ్ …. 7. రోహిణి …. 8. బాబా భాస్కర్ …. 9. పునర్నవి భూపాలం …. 10. హేమ …. 11. అలీ రజా …. 12. మహేశ్ విట్ట …. 13. శ్రీముఖి …. 14. వరుణ్ సందేశ్ …. 15. వితికా షెరు (వరుణ్ సందేశ్ భార్య)
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..