మస్కట్ హోటల్‌లో అగ్ని ప్రమాదం: నలుగురికి గాయాలు
- July 22, 2019
మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లోని ఓ హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా నలుగురికి గాయాలయ్యాయి. పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) వెల్లడించిన వివరాల ప్రకారం, గాయాలపాలైనవారిలో కొందరికి తీవ్రగాయాలు అయ్యాయని, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయనీ తెలుస్తోంది. మస్కట్ గవర్నరేట్‌లోని విలాయత్ బౌషర్‌లోగల ఓ హోటల్‌లో అగ్ని ప్రమాదం జరిగిందనీ, సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని, మంటల్ని అదుపు చేయడం జరిగిందనీ, అందులో చిక్కుకుపోయినవారిని రక్షించామని అధికారులు తెలిపారు. గాయపడ్డవారికి అత్యవసర వైద్య చికిత్స అందించి, అంబులెన్స్ ద్వారా హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం జరిగిందని అధికారులు వివరించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







