పదవతరగతి అర్హతతో నేవీలో ‘సెయిలర్’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
- July 22, 2019
ఇండియన్ నేవీలో సెయిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. పదవతరగతి ఉత్తీర్ణులైన అవివాహిత పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.205 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.
ఇండియన్ నేవీలో ఏప్రిల్-2020 బ్యాచ్‌కు సంబంధించి ‘సెయిలర్’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. పదోతరగతి ఉత్తీర్ణులైన అవివాహిత పురుష అభ్యర్థులు ఈ పోస్టుల వివరాలు..
400 పోస్టులు.. చెఫ్, స్టీవార్డ్, హైజినిస్ట్
అర్హత: పదవతరగతి ఉత్తీర్ణత.. నిర్గిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 01.04.2000 – 31.03.2003 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.205. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా..
శిక్షణ: రాత పరీక్ష, ఇతర పరీక్షల ద్వారా ఎంపికైన అభ్యర్థులకు 2020 ఏప్రిల్‌లో 15 వారాల పాటు ఒడిశాలోని ఐఎన్ఎస్ చిల్కాలో శిక్షణ ఉంటుంది. ప్రొఫెషనల్ ట్రైనింగ్‌తో పాటు ఇతర నావికాదళ శిక్షణ కూడా ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు: ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 26.07.2019.. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01.08.2019.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







