బెలూన్‌ ఫెస్టివల్‌ కొనసాగుతోంది

బెలూన్‌ ఫెస్టివల్‌ కొనసాగుతోంది

మస్కట్‌: సలాలాలో బెలూన్‌ కార్నివాల్‌ కొనసాగుతోందని నిర్వాహకుల్లో ఒకరైన మొహమ్మద్‌ అల్‌ కింది చెప్పారు. కార్నివాల్‌కి సంబంధించి ఓ బెలూన్‌ గ్రౌండ్‌ అయ్యిందంటూ ఓ ఇమేజ్‌ సర్క్యులేట్‌ అవడంపై నిర్వాహకులు స్పందించారు. కార్నివాల్‌ సజావుగా సాగుతోందనీ, ఎలాంటి సాంకేతిక సమస్యలూ తలెత్తలేదని మొహమ్మద్‌ అల్‌ కింది స్పష్టం చేశారు. వాతావరణ పరిస్థితుల కారణంగానే బెలూన్లు గాల్లోకి ఎగరలేదనీ, అయితే సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రం యదాతథంగా ఫెస్టివల్‌ నడిచిందనీ, రాత్రి వరకూ ఫెస్టివల్‌ ఎలాంటి అంతరాయాలూ లేకుండా సందర్శకుల్ని అలరించిందని మొహ్మద్‌ అల్‌ కింది పేర్కొన్నారు.  

 

Back to Top