యూఏఈ మెగా ఈద్‌ అల్‌ అదా సేల్‌: 80 శాతం వరకు డిస్కౌంట్లు

యూఏఈ మెగా ఈద్‌ అల్‌ అదా సేల్‌: 80 శాతం వరకు డిస్కౌంట్లు

యూఏఈ:ఆగస్ట్‌ 1 నుంచి 3 వరకు షార్జా ఎమిరేట్‌ వ్యాప్తంగా భారీ డిస్కౌంట్లతో షార్జా సమ్మర్‌ ప్రమోషన్స్‌ 2019 ఫెస్టివల్‌ నడుస్తుంది. షార్జ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎస్‌సిసిఐ) ఈ సేల్‌ని నిర్వహిస్తోంది. 80 శాతం వరకు డిస్కౌంట్లు ఈ షాపింగ్‌ ఫెస్టివల్‌లో షాపింగ్‌ ప్రియుల్ని అలరించనున్నాయి. ఈ భారీ డిస్కౌంట్లతో టూరిజం సెక్టార్‌ని డెవలప్‌ అవుతుందని ఫెస్టివల్‌ అండ్‌ శ్రీగ్జిబిషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ హనా అల్‌ సువైది చెప్పారు. ఎమిరేట్‌ ఆర్థిక ప్రగతికి ఇలాంటి ఫెస్టివల్స్‌ ఎంతో దోహదం చేస్తాయని హనా అల్‌ సువైది వివరించారు. రిటెయిల్‌ సెక్టార్‌కి మద్దతిచ్చేందుకు తాము ఎల్లప్పుడూ ముందుంటామని వివరించిన అల్‌ సువైది, షార్జా సమ్మర్‌ ప్రమోషన్స్‌ 2019 అంచనాలకు మించి విజయం సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈస్టర్న్‌ మరియు సెంట్రల్‌ రీజియన్‌కి సంబంధించి అన్ని స్టోర్లు, షాపింగ్‌ మాల్స్‌ను ఫీజు నుంచి మినహాయిస్తున్నట్లు తెలిపారరు హనా అల్‌ సువైది. 

Back to Top