బుడతడుతో సరదాగా గడిపిన మోడీ
- July 24, 2019
బిజీ షెడ్యూల్‌లోనూ ప్రధాని మోదీ తన కోసం వచ్చిన చిన్నారి స్నేహితుడితో కాసేపు సరదాగా ఆడుకున్నారు. పార్లమెంట్‌లో మోదీ.. ఓ చిన్నారితో ఆడుతున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. చాలా ప్రత్యేకమైన స్నేహితుడు ఒకరు ఈ రోజు పార్లమెంటులో నన్ను కలుసుకున్నారు అనే క్యాప్షన్ ఇచ్చారు. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ ఫోటోలు లక్షల్లో లైక్‌లతో తెగ వైరల్ అయ్యాయి.
మరోవైపు మోదీ చేతుల్లో బోసి నవ్వుల్ని చిందిస్తున్న ఈ చిన్నారి ఎవరో తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ప్రయత్నం చేశారు. తొలుత మోదీని కలవడానికి వచ్చిన సందర్శకులకు సంబంధించిన వారి బిడ్డగా భావించారు. అయితే చివరకు ఆ బుడతడు ఎవరో తెలిసిపోయింది.
ప్రధాని చేతిలో ఎలాంటి బెరుకు లేకుండా ధీమాగా ఉన్న ఈ బుడతడు బీజేపీ ఎంపీ సత్యనారాయణ జతియా మనవడిగా తేలింది. మర్యాదపూర్వకంగానే మోదీని కలుసుకున్నట్లు ఎంపీ చెప్పారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







