లీష్ లేకుండా కుక్కతో వెళితే 5,000 జరీమానా
- July 24, 2019
అబుదాబీ: పెంపుడు కుక్కలకి మెడలో తాడు (లీష్) లేకుండా బయటకు తీసుకెళితే 5,000 దిర్హామ్‌ల జరీమానా ఎదుర్కోవాల్సి రావొచ్చని అబుదాబీ మునిసిపాలిటీ హెచ్చరించింది. కాగా, డాగ్స్‌ని మాల్స్‌లోకీ అలాగే రెస్టారెంట్స్‌లోకీ అనుమతించబోరు. యానిమల్ వెల్ఫేర్ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో భాగంగా ఈ రిమైండర్‌ని అబుదాబీ మునిసిపాలిటీ విడుదల చేసింది. పెట్ ఓనర్స్ మరియు డీలర్స్‌కి చట్టాల పట్ల అవగాణ కల్పించే కార్యక్రమాలు చేపడ్తున్నామని అబుదాబీ మునిసిపాలిటీ పబ్లిక్ సేఫ్టీ హెడ్ డాక్టర్ సయీద్ మొహమ్మద్ అల్ రుమైతి చెప్పారు. పెట్స్‌ని వీధుల్లో వదిలితే 2,000 దిర్హామ్‌ల వరకు జరీమానా విధిస్తారు. కొన్ని జాతులకు చెందిన ప్రాణుల అమ్మకాలపై నిషేధం వుందనీ, అలాంటివాటిని విక్రయిస్తే 10,000 వరకు జరీమానా తప్పదని అల్ రుమైతి పేర్కొన్నారు. కుక్కలు, పిల్లుల్ని మినహాయించి ఇతర జంతువుల్ని అనుమతి లేకుండా అపార్ట్‌మెంట్లు, విల్లాల్లో పెంచితే 5,000 వరకు జరీమానా తప్పదు. 18 ఏళ్ళ వయసులోపువారికి పెట్స్ అమ్మకం నిషేధం. ఉల్లంఘిస్తే 3,000 దిర్హామ్‌ల జరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







