ఐష్.. మా లక్కీ ఛార్మ్.. ఐశ్వర్య రాయ్ మళ్ళీ..
- July 24, 2019
రెండు నెలలపాటు స్థబ్ధుగా ఉంచిన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ మళ్ళీ తెరిచారు. జైపూర్ పింక్ పాంథర్ జట్టుకు శుభాకాంక్షలు చెబుతూ భర్త అభిషేక్ మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు తీసిన స్క్రీన్‌షాట్స్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ‘పింక్ పాంథర్స్.. గాడ్ బ్లెస్’ అని క్యాప్షన్ కూడా జతపరిచారు. సోమవారం ముంబయిలో ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్ జట్టుతో యూ ముంబా టీమ్ తలపడింది. రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో పింక్ పాంథర్స్‌జట్టు ముంబాయిపై గెలుపొందింది. ఈ సందర్భంగా అభిషేక్ ఫోటోను జతచేసి ఆ జట్టుకు విషెస్ తెలిపింది. దీనికి అభిషేక్ స్పందిస్తూ.. ‘ఐష్.. మా లక్కీ ఛార్మ్’ అంటూ ఐశ్వర్యను పొగుడుతూ మరో పోస్ట్ పెట్టారు.
ప్రస్తుతం ఐశ్వర్య రాయ్ ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్ సెల్వం’ అనే తమిళ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. చోళ సామ్రాజ్యం నేపథ్యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఐశ్వర్య.. రాణి నందిని పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బాలీవుడ్‌లోని పలు చిత్రాల్లో కూడా నటించేందుకు సైన్ చేసింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..