ఆ అంశంపై మౌనం తగదు అంటున్న సోనాక్షి

- July 25, 2019 , by Maagulf
ఆ అంశంపై మౌనం తగదు అంటున్న సోనాక్షి

ఖాందానీ సఫఖానా అనే చిత్రంలో నటిస్తోంది సోనాక్షీ. సుఖ వ్యాధుల వైద్యశాలను నిర్వహించే మేనమామ చనిపోయాక ఆ వైద్యశాల కొనసాగించే బాధ్యతలు తీసుకుంటుంది కథానాయిక. శిల్పి దాస్‌గుప్తా దర్శకత్వం వహించారు. వరుణ్‌ శర్మ, రాపర్‌ బాద్‌షా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఖాందానీ సఫఖానా సినిమా ఆగస్టు 2న విడుదలకు సిద్ధమవుతోంది. సాధారణ సినిమాల కంటే ప్రయోగాత్మక చిత్రాలు చేసేందుకే ఈతరం నాయికలు ప్రాధాన్యతనిస్తున్నారు అనేందుకు సోనాక్షీనే తాజా ఉదాహారణ. నలుగురు మాట్లాడుకునే ఇతివృత్తంతో సినిమా చేస్తే ఎక్కువ మందికి చేరువవుతుందని ఆలోచిస్తున్నారు. బాలీవుడ్‌ సుందరి సోనాక్షీ సిన్హా తన కొత్త చిత్రానికి ఇలాంటి కథనే ఎంచుకుంది. ఈ నేపథ్యంలో సోనాక్షీ సిన్హా మాట్లాడుతూ ఇది చాలా వర్తమాన కావడం వల్లే సినిమాలో నటించాను. ఆడవాళ్లైనా, మగవాళ్లైనా శృంగారం గురించి మాట్లాడాలంటేనే సిగ్గుపడుతుంటారు. ఇది సరైంది కాదు. శృంగార సమస్యలను ధైర్యంగా చెప్పుకుని పరిష్కరించుకోవాలి. మౌనంగా ఉండటం మంచిది కాదు. ఈ సినిమాతో మేమా ధైర్యం ఇవ్వాలని అనుకుంటున్నాం. ఈ సినిమా ఖచ్చితంగా చర్చనీయ అంశం అవుతుంది అని చెప్పింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com