బంగారం ధర మూడు వారాల గరిష్ఠానికి చేరింది..
- January 06, 2016
బంగారం ధర మూడు వారాల గరిష్ఠానికి చేరింది. బుధవారం రూ.60 పెరగడంతో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.25,900కి చేరింది. నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరగడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దీని ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,077.23 అమెరికన్ డాలర్లకు చేరింది. అలాగే ఈ రోజు వెండి ధర సైతం పెరిగింది. రూ.50 పెరగడంతో కేజీ వెండి ధర రూ.33,750కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో దీని ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్







