కొత్త రోడ్ రూల్: ఉల్లంఘనకు 10,000 దిర్హామ్‌ల జరీమానా
- July 27, 2019
అబుదాబీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ అధికారికంగా టోల్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్‌ని ప్రకటించింది. క్యాపిటల్ నుంచి బయటకు వెళ్ళే క్రమంలో టోల్ గేట్స్‌ని దాటుకుని వెళ్ళేవారికి సరికొత్త టోల్ విధానం అందుబాటులోకి తెచ్చారు. నాలుగు డిఫరెంట్ లొకేషన్స్‌లో ఏర్పాటు చేసిన టోల్‌గేట్స్ అక్టోబర్ 15 నుంచి అందుబాటులోకి వస్తాయి. కాగా, ఈ టోల్ గేట్ నుంచి పాస్ అయ్యే నాన్ రిజిస్టర్డ్ వెహికిల్‌కి తొలి రోజు 100 దిర్హామ్‌లు, రెండో రోజు 200 దిర్హామ్‌లు, మూడో రోజు 400 దిర్హామ్‌లు అత్యధికంగా 10,000 దిర్హామ్‌లు జరీమానా చెల్లించాల్సి వుంటుంది. తగినంత బ్యాలెన్స్ రిజిస్టర్డ్ వెహికిల్ అకౌంట్‌లో లేకుంటే, డెడ్‌లైన్ గ్రేస్ పీరియడ్ ముగిసిన తర్వాత రోజుకి 50 దిర్హామ్‌లు జరీమానా విధించడం జరుగుతుంది. నెంబర్ ప్లేట్ టాంపరింగ్‌కి 10,000 దిర్హామ్‌ల జరీమానా. ఇ-పేమెంట్ మెషీన్లకు డ్యామేజీ చేసేలా వాహనాలు నడిపినా 10,000 జరీమానా తప్పదు. అంబులెన్స్‌లు, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మరియు సివిల్ డిఫెన్స్ వాహనాలు, పబ్లిక్ బస్సులు, ట్యాక్సీలు (అబుదాబీలో లైసెన్స్ పొందినవి), స్కూల్ బస్సులు, పోలీస్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వాహనాలు, ట్రైలర్స్ మరియు మోటర్ సైకిల్స్‌ని టోల్ సిస్టమ్ నుంచి మినహాయించారు. రెండేళ్ళపాటు ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా మినహాయింపు వుంటుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..