'దర్బార్'పోస్టర్ విడుదల
- July 28, 2019
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం 'దర్బార్'. ఈ సినిమాపై దక్షిణాది పరిశ్రమలో భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇందులో తలైవర్ పోలీసు అధికారిగా నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమా ఆరంభం నుంచే చిత్రానికి సంబంధించి ఫొటోలు లీకవుతూనే ఉన్నాయి. మరోవైపు తాజాగా రెండు ఫొటోలను దర్శకుడు మురుగదాస్ విడుదల చేశారు. వాటిని ఉపయోగించి పోస్టర్‌ను డిజైన్ చేసి తమకు పంపితే అందులో మంచి డిజైన్ ఎంపిక చేసి అధికారికంగా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. దీంతో అభిమానులందరూ తమ ప్రతిభకు పదును పెడుతున్నారు. ఇప్పటికే ట్విట్టర్‌లో వందల డిజైన్లు కనిపిస్తున్నాయి. ఆ రెండు ఫొటోలతో చిత్ర బృందానికే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ పలు రకాలుగా పోస్టర్లను రూపొందిస్తున్నారు అభిమానులు. కొన్ని డిజైనింగ్ సంస్థలు కూడా బరిలోకి దిగడం ఆశ్చర్యకరం. మొత్తానికి ఈ పోస్టర్ డిజైనింగ్‌తో అభిమానుల్లో సందడి నెలకొంది. త్వరలోనే ఓ మంచి పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..