కర్నాటక రాజకీయం: స్పీకర్ సంచలన నిర్ణయం
- July 28, 2019
కర్నాటక స్పీకర్ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒక విధంగా రెబల్ ఎమ్మెల్యేలకు భారీ షాక్ ఇచ్చారు. మొత్తం 14 మంది రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. ఒక్కొక్కరు నాలుగేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈ వేటు ఉంటుందని స్పీకర్ ప్రకటించడం గమనార్హం.
కాంగ్రెస్- జేడీఎస్ ప్రభుత్వం కూలిపోయి. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. రాజీనామాలను ఆమోదించకుండా ఎక్కువగా కాలం పెండింగ్‌లో పెట్టి ఇప్పుడు అనర్హత వేటు వేయడం సరికాదని సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అనర్హత వేటుకు గురైన వారిలో 11 మంది కాంగ్రెస్ వారు, ముగ్గురు జేడీఎస్ సభ్యులు ఉన్నారు.
వీరంతా బలపరీక్ష సందర్భంగా విప్ ధిక్కరించారన్న ఆరోపణలతో స్పీకర్ వేటు వేశారు. ఇది వరకే ముగ్గురిపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. ఇప్పుడు మరో 14 మందిపై వేటు వేయడంతో మొత్తం 17 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినట్టు అయింది.
అయితే ఒక్కో ఎమ్మెల్యే నాలుగేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా వేటు వేయడం ఎంత వరకు నిలబడుతుంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







