బాబు దావోస్ పర్యటన: బకాయిలు చెల్లించాలని బాబుకు సీఐఐ లేఖ
- July 28, 2019
చంద్రబాబు దుబారాలో ఇది మరో కోణం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏటా దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు చంద్రబాబు వెళ్లే వారు. తనను ఆర్థిక సదస్సు నిర్వాహకులే ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు తాను దావోస్ వెళ్తున్నట్టు చంద్రబాబు చెప్పేవారు. కానీ అది నిజం కాదని తేలింది. ఏపీ ప్రభుత్వానికి చెందిన కోట్ల రూపాయలు చెల్లించి చంద్రబాబు అక్కడికి వెళ్లేవారని స్పష్టమైంది. 2019 జనవరిలో ఆంధ్రప్రదేశ్ బృందం చేసిన దావోస్ పర్యటనకు సంబంధించిన బిల్లు 14. 41 కోట్లు వచ్చింది.
సీఐఐ ద్వారా నాటి ఏపీ బృందం దావోస్‌లో కోట్లు పెట్టి లాంజ్‌ను అద్దెకు తీసుకుంది. ఇందుకు సంబంధించిన డబ్బు చెల్లించాల్సిందిగా సీఐఐ నుంచి ఏపీ ప్రభుత్వానికి లేఖ వచ్చింది. 2019లో ఏపీ బృందం జరిపిన దావోస్ పర్యటన సందర్భంగా అయిన ఖర్చు 14. 41 కోట్లు అని, దాన్ని చెల్లించాలని సీఐఐ కోరింది. జీఎస్టీతో కలిపితే ఈ బిల్లు 17 కోట్లు అని అధికారులు చెబుతున్నారు.
2019లో ఏపీ బృందం దావోస్‌లో తీసుకున్న లాంజ్ అద్దె రూ. 2 కోట్ల 48 లక్షలుగా చూపారు. ఆ లాంజ్ లో కంప్యూటర్లు, సోపాలు ఏర్పాటు చేసేందుకు మరో 2. 51 కోట్లను బిల్లు వేశారు. ఏపీ బృందం నాలుగు రోజుల భోజనాల ఖర్చు కోటి ఐదు లక్షలు. ఆశ్చర్యంగా ఈ లాంజ్‌లో ఒక ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటుకు ఏకంగా కోటి 45 లక్షల బిల్లు చేశారు. ఇలా రకరకాల ఖర్చుల కింద మొత్తం బిల్లు 14 కోట్ల 41 లక్షలుగా ఉంది.
ఇప్పుడు ఈ మొత్తం ఖర్చును చెల్లించాల్సిందిగా సీఐఐ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. 2018లో చంద్రబాబు స్వయంగా దావోస్ వెళ్లినప్పుడు అయిన బిల్లు 9. 86 కోట్లు. చంద్రబాబు బృందం వెళ్లిన ప్రత్యేక విమానాలు, వారు బస చేసిన హోటళ్ల ఖర్చు అదనం.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







