ఏ.పిలో అన్న క్యాంటీన్లు క్లోజ్!

- August 01, 2019 , by Maagulf
ఏ.పిలో అన్న క్యాంటీన్లు క్లోజ్!

 

ఆంధ్రప్రదేశ్‌లో అన్నక్యాంటీన్లు మూతపడ్డాయి. రాజన్న క్యాంటీన్లుగా పేరు మార్చినా.. రాష్ట్రవ్యాప్తంగా తెరుచుకోలేదు. దీంతో.. భోజనం సమయానికి క్యాంటీన్ల దగ్గరకు వచ్చిన చిరు వ్యాపారులు, నిరుపేదలు ఆకలితో వెనుతిరిగారు. ఏ రోడ్డు పక్కనో, చెట్టు కిందో కాకుండా.. గౌరవంగా ఆహారం అందించేందుకు చంద్రబాబు హయాంలో రాష్ట్రవ్యాప్తంగా అన్నక్యాంటీన్లు ఏర్పాటు చేశారు. 15 రూపాయలు పెడితే.. మూడు పూటలా పేదల కడుపు నిండేది. ఇప్పుడవన్నీ మూతపడ్డాయి.

పనిమీద పట్నం వచ్చిన పేదలు, చిరు వ్యూపారులకు అన్న క్యాంటీన్లు చాలా ఉపయోగపడ్డాయి. క్వాలిటీ విషయంలోను కాంప్రమైజ్ కాలేదు. మంచి పేరున్న అక్షయపాత్ర ఫౌండనేషన్‌కు బాధ్యత అప్పగించారు. వాళ్లతో ఒప్పందం కొనసాగింపునకు ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. పైగా.. 70 కోట్ల రూపాయల వరకు బకాయి పడింది. దీంతో.. భోజనశాలలు బంద్ అయ్యాయి. అన్న క్యాంటీన్లను రాజన్న క్యాంటీన్లుగా పేరు మార్చి, భవనాలకు పసుపు స్థానంలో వైసీపీ రంగులద్ది కొనసాగిస్తారని అంతా భావించారు. ప్రభుత్వం కూడా ఆ పథకాన్ని కొనసాగిస్తామనే చెప్తూ వచ్చింది. వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com