శుభవార్త చెప్పిన శిల్పాశెట్టి
- August 01, 2019
బాలీవుడ్ భామ శిల్పాశెట్టి అభిమానులకు శుభవార్త చెప్పింది. త్వరలోనే ‘నికమ్మ’ మూవీతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఇన్‌స్టా లో పోస్ట్ పెట్టారు. ” అవును, ఇది నిజం! 13 సంవత్సరాల నా సుదీర్ఘ విరామానికి ముగింపు పలుకుతున్నా.. త్వరలోనే నికమ్మ చిత్రంలో కనిపించబోతున్నాను. ఈ విషయం మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. అభిమన్యు, షిర్లేసేతియా వంటి ప్రతిభావంతులైన నటులతో కలిసి నటిస్తున్నందకు ఆనందంగా ఉంది. నాపై మీ ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉండాలి ఇన్నాళ్ళుగా మీరు కురిపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు” అంటూ ఓ వార్తా పత్రిక క్లిప్పింగ్‌ను జత చేస్తూ ఇన్‌స్టా ఖాతలో ఓ పోస్ట్ పెట్టారు. 90 వ దశకంలో బాలీవుడ్ ఓ ఊపు ఊపిన పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ప్రస్తుతం ఓ కుమారుడు.
అనంతరం కొద్దిరోజులు సినిమాలకు దూరంగా ఉన్నారు. భర్త రాజ్‌కుంద్రా ఓనర్‌గా వ్యవహరించిన రాజస్థాన్ రాయల్స్ టీం బాధ్యతలను చూసుకున్నారు. ఆ జట్టు ఆడే ప్రతి మ్యాచ్‌లో కనిపిస్తూ సందడి చేశారు. బిగ్ స్ర్ర్కిన్‌కు దూరమైన శిల్ప డిజిటల్ ప్లాట్ ఫామ్‌పై మెరిశారు. యోగా , తన ముద్దుల కుమారుడు వియాన్‌కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వాటిని అభిమానులతో పంచుకున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..