ఈద్‌ అల్‌ అదా 2019: నాలుగు రోజుల సెలవు

- August 02, 2019 , by Maagulf
ఈద్‌ అల్‌ అదా 2019: నాలుగు రోజుల సెలవు

ఫెడరల్‌ అథారిటీ ఫర్‌ గవర్నమెంట్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌, నాలుగు రోజుల సెలవుల్ని ఈద్‌ అల్‌ అదా సందర్భంగా పబ్లిక్‌ మరియు ప్రైవేట్‌ సెక్టార్స్‌కి ప్రకటించడం జరిగింది. ఆగస్ట్‌ 9 నుంచి సెలవులు ప్రారంభమవుతాయి. 12వ తేదీతో సెలవులు ముగియనున్నాయి. పబ్లిక్‌, ప్రైవేట్‌ సెక్టార్స్‌కి ఒకే విధంగా సెలవులు వుండేలా యూఏఈ ఈ ఏడాది మొదట్లో నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. కాగా, జుల్‌ హిజాహ్‌ మూన్‌, సౌదీ అరేబియాలో గురువారం సాయంత్రం కనిపించినట్లు ప్రకటించింది. దాంతో, ఇస్లామిక్‌ మంత్‌ జుల్‌ హిజాహ్‌ తొలి రోజు ఆగస్ట్‌ 2 నుంచి ప్రారంభమవుతుంది. దాంతో, ఈద్‌ అల్‌ అదా ఆగస్ట్‌ 11 న ప్రారంభమవుతుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com