ఖతార్‌లో 'సైమా' అవార్డుల వేడుక
- August 02, 2019
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలకు సంబంధించి ఏటా నిర్వహించే సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) వేడుక ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించనున్నారు. వివిధ కేటగిరీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటులకు అవార్డులను ప్రదానం చేయనున్నారు. సినీ రంగానికి విశిష్ఠ సేవలు అందించిన ప్రముఖులను సత్కరిస్తారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులతో ఆగస్టు 15, 16వ తేదీల్లో సైమా అవార్డుల వేడుకలను ఖతార్‌లోని దోహాలో ఘనంగా నిర్వహించనున్నారు. ఆగస్టు 15న తెలుగు, కన్నడ చిత్రసీమలకు సంబంధించి జరిగే అవార్డు వేడుకలో ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి సందడి చేయనున్నారు. 16వ తేదీన జరిగే తమిళ, మలయాళ పురస్కారాల వేడుకకు మోహన్‌లాల్ ముఖ్య అతిథిగా రానున్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..