మేల్ గార్డియన్ అప్రూవల్ నుంచి సౌదీ మహిళలకు విముక్తి
- August 02, 2019
మేల్ గార్డియన్ అప్రూవల్ లేకుండానే సౌదీ మహిళలు విదేశాలకు వెళ్ళేందుకు ఇకపై అనుమతి లభించనుంది. ఇది ఆహ్వానించదగ్గ అలాగే చారిత్రక పరిణామంగా పలువురు అభిప్రాయపడ్తున్నారు. ఇప్పటివరకూ భర్త, తండ్రి లేదా ఇతర మేల్ రిలేటివ్స్ అనుమతి లేకుండా సౌదీ మహిళ, విదేశాలకు వెళ్ళేందుకు వీల్లేదు. అయితే, ఇకపై ఆ సమస్య నుంచి మహిళలకు విముక్తి లభించనుంది. అప్లికేషన్ సబ్‌మిట్ చేస్తే, సౌదీ జాతీయులెవరికైనా పాస్‌పోర్ట్ లభిస్తుందని సౌదీ అఫీషియల్ గెజిట్ చెబుతోంది. 21 ఏళ్ళ పైబడిన మహిళలు, విదేశాలకు వెళ్ళేందుకు ఇకపై గార్డియన్ అనుమతి అవసరం వుండదని గెజిట్ పేర్కొంటోంది. మరోపక్క, ఈ నిర్ణయాన్ని సౌదీ మహిళలు స్వాగతిస్తున్నారు. సౌదీ మహిళలకు సంపూర్ణమైన స్వేచ్ఛ లభించినట్లుగా భావస్తన్నట్లు ఓ మహిళ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..