సైనిక శిబిరంపై హౌతీ సంస్థ దాడి.. 32 మంది మృతి
- August 03, 2019
యెమెన్ లో మిలటరీ పెరెడ్ రక్తసిక్తమైంది. సైనికుల శిబిరంపై హౌతీ సంస్థ దాడికి పాల్పడింది. ఈ దాడిలో దాదాపు 32మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. మిలటరీ పెరెడ్ పై హౌతీ మద్దతు దారులు కారుబాంబుతో ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడి ఇరాన్ మద్దతుతో పనిచేస్తున్న హౌతీ పాల్పడిందని సౌదీ అరేబియా ఆరోపించింది. యెమెన్ ప్రధానమంత్రి మెయిన్ అబ్దుల్ మాలిక్ సయీద్ సైతం ఇదే అంశాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. మిలటరీ పెరెడ్ తోపాటు పోలీస్టేషన్ పై దాడికి పాల్పడిందని పేర్కొన్నారు. అయితే ఇక్కడ ప్రధానికి సౌదీ అరేబియా మద్దతు తెలుపుతుండగా… ఏర్పాటువాదులకు ఇరాన్ మద్దతుగా నిలుస్తోంది. దీంతో గత కొంతకాలంగా ఇరువర్గాలు దాడులకు దిగుతున్నాయి.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..