సూపర్ స్టార్స్ గురువు దేవదాస్ కనకాల ఇకలేరు !
- August 03, 2019నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల కన్నుమూశారు. అనారోగ్యంతో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 74 ఏళ్లు. కనకాల మృతితో టాలీవుడ్లో విషాదం నెలకొంది. పలువురు సీనీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు.
1945 జులై 30న యానాంలో జన్మించారు దేవదాస్ కనకాల. 100కు పైగా సినిమాల్లో నటించిన దేవదాస్ కనకాల.. నట గురువుగా ఎందరో నటులకు శిక్షణ ఇచ్చారు. యాక్టింగ్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా తెలుగు తెరకు ఎంతో మంది ప్రతిభావంతులను పరిచయం చేశారాయన. ప్రతిభావంతమైన నటుడిగా దేవదాస్ కనకాలకు పేరుంది. దేవదాస్ తనయుడు రాజీవ్ కనకాల నటుడిగా కొనసాగుతుండగా.. ఆయన కోడలు సుమ యాంకర్‌గా ఉన్నారు.
ప్రతిభావంతుడైన నటుడిగా దేవదాస్ కనకాలకు పేరు ఉంది. అయితే దర్శకుడిగా మాత్రం పెద్దగా విజయం సాధించలేకపోయారు కనకాల. చలిచీమలు, నాగమల్లి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఓ సీత కథ. గోరింటాకు, మల్లీశ్వరీ, సిరిసిరి మువ్వ, మంచు పల్లకి, గ్యాంగ్ లీడర్, పెదబాబు, కింగ్, జోష్, భలే దంపతులు, మనసంతా నువ్వే, నీ స్నేహంతో పాటు పలు చిత్రాల్లో నటించారు. కనకాల నటించిన చివరి చిత్రం భరత్ అనే నేను.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు