సూపర్ స్టార్స్ గురువు దేవదాస్ కనకాల ఇకలేరు !
- August 03, 2019
నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల కన్నుమూశారు. అనారోగ్యంతో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 74 ఏళ్లు. కనకాల మృతితో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. పలువురు సీనీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు.
1945 జులై 30న యానాంలో జన్మించారు దేవదాస్ కనకాల. 100కు పైగా సినిమాల్లో నటించిన దేవదాస్ కనకాల.. నట గురువుగా ఎందరో నటులకు శిక్షణ ఇచ్చారు. యాక్టింగ్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా తెలుగు తెరకు ఎంతో మంది ప్రతిభావంతులను పరిచయం చేశారాయన. ప్రతిభావంతమైన నటుడిగా దేవదాస్ కనకాలకు పేరుంది. దేవదాస్ తనయుడు రాజీవ్ కనకాల నటుడిగా కొనసాగుతుండగా.. ఆయన కోడలు సుమ యాంకర్‌గా ఉన్నారు.
ప్రతిభావంతుడైన నటుడిగా దేవదాస్ కనకాలకు పేరు ఉంది. అయితే దర్శకుడిగా మాత్రం పెద్దగా విజయం సాధించలేకపోయారు కనకాల. చలిచీమలు, నాగమల్లి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఓ సీత కథ. గోరింటాకు, మల్లీశ్వరీ, సిరిసిరి మువ్వ, మంచు పల్లకి, గ్యాంగ్ లీడర్, పెదబాబు, కింగ్, జోష్, భలే దంపతులు, మనసంతా నువ్వే, నీ స్నేహంతో పాటు పలు చిత్రాల్లో నటించారు. కనకాల నటించిన చివరి చిత్రం భరత్ అనే నేను.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







