ఆసక్తి ఉన్న యువతీ యువకులకు సినిమా, టీవీ రంగాల్లో శిక్షణ
- August 03, 2019
తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ(ఎప్డీసీ) ఆసక్తి ఉన్న యువతీ యువకులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు చైర్మన్ రామ్మోహన్‌రావు తెలిపారు. తెలంగాణాలో మీడియా అండ్ ఎంటర్‌టెయిన్‌మెంట్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంఈఎస్‌సీ), జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా సినిమా టీవీ రంగానికి సంబంధించిన 24 క్రాప్ట్స్‌లో శిక్షణ ఇచ్చేందుకు కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఎస్‌సీ ప్రతినిధులు జ్యోతిజోషితో సమావేశమై పలు అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఆసక్తి ఉన్న యువతకు సెమినార్లు, వర్క్‌షాపుల ద్వారా నిపుణులతో శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేస్తామన్నారు. శిక్షణకు సంబంధించిన ఆర్థిక సహాకారాన్ని మినిస్టీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా అందజేయనున్నట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..