బ్రిటిష్ విమానంలో బాంబు కలకలం దుప్పటి తో దొరికిన దుండగుడు
- January 06, 2016
" నా వద్ద బాంబు ఉంది...కనుక ప్రతి ఒక్కరు నాతోపాటు చనిపోతారు " అని బిగ్గరగా అరుస్తూ...తోటి ప్రయాణికులను భయంతో గజ గజ వణికించిన ఓ విమాన ప్రయాణికుదిని ఎట్టకేలకు అదుపులోనికి తీసుకొన్నారు. సంచలనం కలిగించిన ఈ ఉదంతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బుధవారం లండన్ లోని హార్ట్ త్రో ఎయిర్ పోర్ట్ నుంచి దుబాయ్ కు ప్రయాణం కాబోతున్న బ్రిటిష్ ఎయిర్వేస్జి చెందిన విమానంలో పై సంఘటన చోటు చేసుకొంది. ఈ ఘటనను వర్జీన్ రేడియో మాజీ ఉద్యోగీ కుమార్తె నటాలీ తన తండ్రికి ఈ విషయం ఇంటర్నెట్ ద్వారా తెలియచేయగా ఆయన ఈ వార్తను డైలీ మెయిల్ అనే బ్రిటిష్ దినపత్రికకు తెలిపారు. ఐదుగంటల పాటు విమానంలో కొనసాగిన ఈ ఉత్కంటకు ఐదుగురు విమాన సిబ్బంది, మరో ప్రయాణికుడు చొరవ తీసుకొని, బాంబు ఉందని బెదిరిస్తున్న వ్యక్తిపై దుప్పటి తోఒక్కసారిగా దూకి ముసుగు తొడిగి బంధించడంతో అందరూ ఉద్రక్త వాతావరణం నుంచి బైట పడ్డారు, .కాగ , దుప్పట్లో దుండగుడు '' నాకు ఊపిరి ఆడటం లేదు ...నన్ను వదలండి " అంటూ మరల బిగ్గరగా కేకలు వేయడం పలువురికి నవ్వు తెప్పించింది. ఈ సందర్భంగా బ్రిటిష్ ఎయిర్వేస్ అధికారులు మాట్లాడుతూ, ఈ తరహా ఆకతాయి చేష్టలను తమ సంస్థ సహించదని , అందుకు చట్టపరమైన చర్యలు
ఆ వ్యక్తి పై తీసుకోనున్నట్లు వారు తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







