ఇండిగో నుంచి కొత్తగా మరో 24 విమానాలు
- January 06, 2016
సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉన్న దేశీయ విమానయాన సంస్థ ఇండిగో నుంచి కొత్తగా మరో 24 విమానాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. వీటిలో దిల్లీ తిరువనంతపురం మధ్య ప్రతిరోజు తిరిగే తొలి నాన్‌స్టాప్ సర్వీసు ఉంది. కొత్తగా వచ్చిన 24 విమానాలతో దేశంలో 39 నగరాల మధ్య ఇండిగో విమాన సర్వీసుల సంఖ్య మరింత పెరగనుంది. బెంగళూరు నుంచి విశాఖపట్నం, భువనేశ్వర్, అహ్మదాబాద్.. భువనేశ్వర్ నుంచి కోల్‌కతా, చెన్నై నుంచి తిరువనంతపురం మధ్య నాన్‌స్టాప్ సర్వీసులు తిరగనున్నాయి. దిల్లీతిరువనంతపురం మధ్య నాన్‌స్టాప్ సేవలు రేపటి నుంచే అందుబాటులోకి రానున్నాయి. విమాన ప్రయాణ ధరలు అందుబాటులో ఉండటంతో కేరళ వాసులకు దిల్లీ తిరువనంతపురం నాన్‌స్టాప్ సర్వీసుతో ఎక్కువ మేలు చేకూరనుందని ఇండిగో సంస్థ అధ్యక్షుడు ఆదిత్యఘోష్ చెప్పారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







