వైరల్ అవుతున్న 'చిరు' న్యూ లుక్
- August 04, 2019
మెగాస్టార్ చిరంజీవి కొత్త లుక్‌లో ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను చిరు కోడలు ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆమె 'బీ పాజిటివ్' అనే హెల్త్ మ్యాగజైన్ నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం చిరు ఫొటోషూట్ చేయించారు. ఈ కొత్త లుక్‌లో చిరు అదిరిపోయారు.
చిరు ప్రస్తుతం 'సైరా నరసింహారెడ్డి'లో నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకుడు. నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అక్టోబరు 2న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..