యూఏఈ రాఫెల్ లో 15 మిలియన్ దిర్హామ్‌లు గెల్చుకున్న ఇద్దరు తెలంగాణా వాసులు
- August 05, 2019
యూఏఈ:మాజీ దుబాయ్ రెసిడెంట్ అలాగే, అబుదాబీకి చెందిన అతని స్నేహితుడు 15 మిలియన్ దిర్హామ్‌లను బిగ్ టికెట్ అబుదాబీ రాఫెల్ లో గెలుచుకున్నారు. విలాస్ రిక్కాల, రవి మాసిపెద్ది.. ఇద్దరూ ఇండియాలోని తెలంగాణకు చెందిన నిజామాబాద్ జిల్లా వాసులు. కొంతకాలంగా ఈ ఇద్దరూ టిక్కెట్లు కొనుగోలు చేస్తూ వస్తున్నారు. అయితే, జులై 29న కొనుగోలు చేసిన టాక్కెట్కి అదృష్టం వరించింది. ఇండియాకి వెళ్ళిపోయిన విలాస్ రిక్కాల, తనకు వచ్చిన బహుమతి పట్ల అమితమైన ఆనందాన్ని వ్యక్తం చేశారు. దుబాయ్‌లో 4 నుంచి 5 ఏళ్ళు పనిచేశానని ఆయన చెప్పారు. మరోపక్క రవి మాసిపెద్ది మాట్లాడుతూ, చాలా ఏళ్ళుగా తామిద్దరం టిక్కెట్లు కొంటున్నామనీ, ఎట్టకేలకు తమకు బహుమతి లభించిందని అన్నారు. చెరో సగం బహుమతిని తాము పంచుకుంటామని చెప్పారు. కాగా, టాప్ 10 విన్నర్స్‌లో ఇండియన్స్ ఎక్కువగా వున్నారు. మొత్తం ఐదుగురు బిగ్ టికెట్ అబుదాబీ రాఫెల్ లో విజేతలుగా నిలిచారు. ఫిలిప్పీన్స్ నుంచి ఇద్దరు, ఈజిప్ట్ మరియు సోమాలియా నుంచి చెరొకరు విజేతలున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







