ఆల్కహాల్ విక్రయం: ఆసియన్ మేన్‌కి జైలు శిక్ష
- August 06, 2019
బహ్రెయిన్:లిక్కర్ బాటిల్స్‌ని విక్రయించేందుకు వీలుగా తన కోల్డ్ స్టోర్‌ని వినియోగించుకున్న ఓ ఆసియాకి చెందిన వ్యక్తికి జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. తన కోల్డ్ స్టోర్‌లో లిక్కర్ బాటిల్స్‌ని దాచి, ఎంపిక చేసుకున్న వ్యక్తులకు మాత్రమే విక్రయిస్తూ వచ్చాడని నిందితుడి గురించిన వివరల్ని ప్రాసిక్యూటర్స్ వెల్లడించారు. పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించగా, నిందితుడికి చెందిన కోల్డ్ స్టోర్‌లో 52 లిక్కర్ బాటిల్స్‌ని కనుగొన్నారు. కాగా, అతని నుంచి 18 బహ్రెయినీ దినార్స్ విలువైన కరెన్సీ బిల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. కాగా, న్యాయస్థానం నిందితుడికి మూడు నెలల జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష పూర్తయ్యాక, నిందితుడ్ని దేశం నుంచి డిపోర్ట్ చేస్తారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పుని పై కోర్టు కూడా సమర్థించడంతో అప్పీల్ చేసుకునే అవకాశాలు కూడా లేకుండా పోయాయి నిందితుడికి.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..