'అయోగ్య'తెలుగు ట్రైలర్ విడుదల
- August 06, 2019
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ మూవీ టెంపర్.. తమిళనాట 'అయోగ్య' పేరుతో రీమేక్ అయ్యింది. తమిళ్‌తో పాటు, తెలుగులోనూ అభిమానులను సంపాందించుకున్న యంగ్ హీరో విశాల్ హీరోగా నటించగా.. అతనికి జోడీగా రాశీ ఖన్నా నటించింది.. లైట్ హౌస్ మూవీ మేకర్స్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై, ఠాగూర్ మధు నిర్మించగా.. వెంకట్ మోహన్ డైరెక్ట్ చేసిన అయోగ్యని.. తెలుగులో అదే పేరుతో డబ్ చేసి విడుదల చెయ్యనున్నారు. రీసెంట్‌గా తెలుగు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.
విశాల్‌కి వేరే వ్యక్తితో డబ్బింగ్ చెప్పిచడంతో ట్రైలర్ ఏమంత ఆసక్తిగా అనిపించలేదు. పందెంకోడి 2 ప్రమోషన్స్ టైములో.. అయోగ్యను తెలుగులో రిలీజ్ చెయ్యం, తెలుగు ఆడియన్స్ యాక్టింగ్ పరంగా నన్ను తారక్‌తో కంపేర్ చేస్తారు.. నేను తను చేసినంత బాగా ఆ క్యారెక్టర్ చెయ్యలేను అని చెప్పాడు విశాల్. తమిళ్ రిజల్ట్‌ని దృష్టిలో పెట్టుకుని నిర్మాత తెలుగులో విడుదల చేస్తున్నట్టున్నాడు. ఇక్కడ ఎన్టీఆర్ దయగా కనిపిస్తే, విశాల్ కర్ణగా కనిపించనున్నాడు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..