'కమల్‌హాసన్' న్యూ లుక్
- August 06, 2019
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'భారతీయుడు2'. ఈ చిత్రంలో నటుడు కమల్‌హాసన్..కాజల్ నటిస్తున్నారు. ఎప్పుడో కొబ్బరికాయ కొట్టిన ఈ చిత్రం మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా ఉంది. ఈ నేపథ్యంలో కమల్‌హాసన్ తాజా లుక్ చూస్తుంటే త్వరలోనే ఈ సినిమా మళ్లీ పట్టాలెక్కే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కమల్ ప్రస్తుతం తమిళ బిగ్‌బాస్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తు న్నాడు. తాజాగా ఆయన క్లీన్ షేవ్‌తో కనిపించారు. దీంతో తాజా లుక్ 'భారతీయుడు2' కోసమేనని సినీ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కమల్-శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 19వ తేదీ నుంచి రాజమహేంద్రవరంలో షూటింగ్ చేస్తార ట. అయితే, దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..