కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ

- August 11, 2019 , by Maagulf
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ

కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షురాలిగా మరోసారి సోనియాగాంధీ పగ్గాలు చేపట్టారు. శనివారం దీనిపై విస్తృతంగా చర్చించిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటి….. చివరకు సోనియాను తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నుకుంది. సుధీర్ఘ కసర్తతు, తీవ్ర తర్జన భర్జన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది సీడబ్ల్యూసీ. పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు రాహుల్‌ అంగీకరించకపోవడంతో … సోనియాగాంధీని తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నుకున్నట్లు సీనియర్‌ నేత ఆజాద్‌ ప్రకటించారు..

పార్టీ అధ్యక్ష పదవికి ఎవరన్నదానిపై చర్చించేందుకు శనివారం ప్రత్యేకంగా సమావేశమైంది కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ.ఈ సమావేశానికి ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేతలు గులాంనబీ ఆజాద్‌, చిదంబరం, ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్, యువ నేతలు జ్యోతిరాధిత్య సింధియా, రణ్‌దీప్ సూర్జేవాలా తదితరులు హాజరయ్యారు. రాహుల్ రాజీనామాపై విస్తృతంగా చర్చించింది. రాజీనామాను వెనక్కి తీసుకొని, అధ్యక్ష పదవిలో కొనసాగాలంటూ రాహుల్‌కు విజ్ఞప్తి చేశారు CWC సభ్యులు. ఇందుకు రాహుల్ అంగీకరించలేదు. అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో తమ ప్రమేయం ఉండదన్నారు. పార్టీ నాయకులు చర్చించి నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. CWC మీటింగ్‌ జరుగుతుండగానే సోనియా, రాహుల్ అర్ధాంతరంగా బయటకు వెళ్లిపోయారు. ఏకాభిప్రాయం రాకపోవడంతో 5 బృందాలుగా ఏర్పడి నాయకుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు..

తిరిగి మరోసారి సమావేశమైంది కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటి. పార్టీ నాయకుడి ఎంపికలో జోక్యం చేసుకోబోమన్న సోనియా, రాహుల్.. రెండోసారి జరిగిన సమావేశానికి హాజరయ్యారు. రాహుల్‌గాంధీ తన పట్టు వీడకపోవడంతో…. పీసీసీ చీఫ్‌లు, కాంగ్రెస్‌ సభాపక్షనేతలు.. పార్టీ ఎంపీలు ఏకాభిప్రాయంతో.. సోనియాను తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. ప్రస్తుతం పార్టీ ఉన్న క్లిష్ట సమయంలో.. సోనియా గాంధీ మాత్రమే కాంగ్రెస్‌ పార్టీలో స్థైర్యం నింపగలరని భావించారు కాంగ్రెస్‌ వర్కింగ్‌కమిటీ నేతలు. అందుకే సోనియాకే మళ్లీ అధ్యక్షపదవి ఇచ్చారు. రాహుల్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ…. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూసింది. దీంతో అధ్యక్షపదవికి రాజీనామా చేశారు రాహుల్‌. ఇప్పుడు సోనియా నేతృత్వంలో…. కాంగ్రెస్‌కు మళ్లీ పునర్వైభవం వస్తుందా లేదా అన్నది చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com