'పండు గాడి ఫోటో స్టూడియో' ఆడియో విడుదల..
- August 12, 2019
హాస్యనటుడు అలీ కథానాయ కుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం పండు గాడి ఫోటో స్టూడియో. దీనికి వీడు ఫోటే తీస్తే పెళ్ళి అయిపోద్ది అన్నది ఉపశీర్షిక. దిలీప్‌రాజా దర్శకత్వంలో గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అతిథులుగా విచ్చేసిన ప్రముఖ దర్శకులు పూరి జగన్నాథ్, బోయపాటి శ్రీను ఆడియో సీడీని విడుదలచేయగా. ఎస్వీ.కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరో అలీ మాట్లాడుతూ, నాకు మొదట కొన్ని పాటలు పంపి వినమ న్నారు. పాటలతో పాటు కథ కూడా నచ్చడంతో ఈ సినిమా చేశాను. నిర్మాత అనుకున్న బడ్జెట్‌లోనే సినిమాను పూర్తిచేశారు. అందరికీ నచ్చే లా ఈ చిత్రం ఉంటుందని ఆశిస్తున్నా అని అన్నారు. దర్శకుడు దిలీప్‌రాజా మాట్లాడుతూ, దర్శకుడు సుకుమార్ ఈ కథను ఓకే అన్న తర్వాతే చిత్రం తీయడం జరిగింది. జంధ్యాల మార్క్‌తో చిత్రం ఉంటుంది. హీరోగా రీఎంట్రీ ఇస్తూ. అలీ ఈ సినిమాకు పూర్తి న్యాయం చేకూర్చారు.
సీన్ టు సీన్ కామెడీ ఉండేలా పూర్తి హాస్య ప్రధానంగా ఈ స్క్రిప్టు తయారు చేసుకున్నాను. యాజమాన్య అందించిన సంగీతం ఆహ్లాదభరితంగా ఉంటుంది అని అన్నా రు. నిర్మాత గుదిబండి సాంబిరెడ్డి మాట్లాడు తూ, మా విద్యాసంస్థలు వివిధ ప్రాంతా లలో విజయవంతంగా నడుస్తున్నాయి. తొలి సారి సినీరంగంలోకి అడుగుపెట్టి కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాన్ని అందిస్తున్నాం. మా బేనర్‌లో రెండో ప్రాజెక్టుగా మమ్ముట్టి నటించిన చిత్రాన్ని సెప్టెం బర్‌లో ప్రేక్షకుల ముందు కు తీసుకుని రానున్నాం అని చెప్పారు. ఈ కార్య క్రమంలో బాపట్ల ఎంపీ నందిగామ సురేష్, నటులు శ్రీకాంత్, నరేష్, అల్లరి నరేష్, బాబూమోహన్, ఛార్మి, ఖయ్యూమ్, ప్రవీణ్, అనిల్ కడియాల తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..