రోజా ఇంటికి కేసీఆర్..షెడ్యూల్‌లో మార్పు
- August 12, 2019
తిరుపతి:తెలంగాణ సీఎం కేసీఆర్ రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. సీఎంకు ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి, మిథన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. కంచి శ్రీ అత్తి వరదరాజ స్వామి వారి దర్శనార్థం హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నకేసీఆర్ రోడ్డు మార్గాన కంచికి బయలుదేరి వెళ్లారు. కంచికి వెళ్లేదారిలోని నగరిలో ఎమ్మెల్యే రోజా ఇంటికి చేరుకుని తేనీటి విందు స్వీకరిస్తారని తొలుత అనుకున్నారు. అయితే సమయాభావం వల్ల షెడ్యూల్‌లో చిన్నపాటి మార్పులు చేశారు. స్వామివారి దర్శనార్థం తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మెల్యే రోజా ఇంటికి కేసీఆర్ వెళ్తారని తెలిసింది. కేసీఆర్ కుటుంబానికి ఎమ్మెల్యే రోజా విందు ఏర్పాటు చేశారు. కంచి వరదరాజ స్వామి ఆలయం దర్శనానికి వెళ్తూ మార్గమధ్యలో నగరి ఎమ్మెల్యే రోజా ఇంటికి కేసీఆర్ వెళ్తారని అలాగే రోజా ఇంటిలో సీఎంకు ఉదయం 9 గంటలకు టిఫిన్, మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం ఏర్పాట్లు చేస్తారని మొదట షెడ్యూల్ లో పేర్కొన్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..