నేడు అందాల నటి శ్రీదేవి పుట్టిన రోజు
- August 13, 2019నటన అందం శృంగారం హావభావాల తో కమర్షియల్ గా ఎన్నో విజవంతమైన సినిమాలలో ఆమె నటనకు నీరాజనాలే లభించాయి. అనేక సినిమాలు ఆమె వలననే సూపర్ హిట్ అయ్యాయి. ఎన్.టి.ఆర్ - శ్రీదేవి "ఒక ఆన్ స్క్రీన్ బ్రాండ్ పెయిర్" అలాగే చిరంజీవి, వెంకటేష్, నాగార్జున తో జట్టు గట్టిన సినిమాలు తెలుగు చిత్ర సీమను ఉర్రూతలూగించాయి.
తన నాలుగేళ్ళ వయసు నుండే బాలనటి గా అనేక అవార్డ్స్ గెలుచుకుంది. తెలుగులో ఎన్.టి.ఆర్ మనవరాలుగా బడిపంతులు సినిమాలో నటించి పేరు ప్రతిష్ఠలు ఘడించింది. అదే శ్రీదెవి 1979 లో ఎన్.టి.ఆర్ వెటగాడు సినిమాలో జోడీ కట్టి ఆ సినిమా బ్లాక్-బస్టర్ గా నిలిచింది. 1976 లో రజనికాంత్ తో ఒక తమిళ సినిమాలో కథానాయకి గా తొలిసారి నటించి ఘనవిజయం స్వంతం చేసుకుంది.
తన అందచందాలతో, హావభావాలతో అన్ని తరాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న శ్రీదేవి
'జగదేక వీరుడు అతిలోక సుందరి" సినిమాలో దేవలోకంలోంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా కనిపించే శ్రీదేవి అంటే ఇష్టపడని వారంటు ఉండరు. శ్రీదేవి అంటే అందం, అభినయం, హుందాతనం, దర్పం, ప్రేమ, త్యాగం, లాలిత్యం.
ఫిబ్రవరి 24, 2018 న దుబాయ్ లో తాను బసచేసిన హోటల్ గది బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తూ మునిగి శ్రీదేవి మరణించింది. ఈమె మరణవార్త విని ఆసేతుహిమాచలం దిగ్భ్రాంతికి గురి అయింది. ఈమెను కడసారి చూడటం కోసం దక్షిణాది నుండి ఎందరో సినీప్రముఖులు, అభిమానులు, బంధువులు ముంబై తరలి వచ్చారు. అశేషమైన అభిమాన జనసందోహం వెంట నడువగా ఫిబ్రవరి 28న ముంబైలో ఈమె అంతిమయాత్ర చిరస్మరణీయంగా జరిగింది. చిత్రసీమలో మూడు దశాబ్దాలపాటు అగ్రనాయికగా వెలుగొంది అప్సరసను తలపించే అందం, అంతకుమించిన అభినయంతో భారతీయుల హృదయాలలో చెరగని ముద్రవేసిన శ్రీదేవి అంత్యక్రియలు మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో జరగడంతో ఆమె ఘనతకు తగిన వీడ్కోలు లభించినట్లయింది.
తాజా వార్తలు
- ఈద్ అల్ అదా.. అర్థరాత్రి వరకు పబ్లిక్ పార్కులు
- ఉక్రెయిన్ శాంతి ప్రక్రియలో రష్యా భాగస్వామ్యం అవసరం.. సౌదీ
- యూఏఈలో ఈద్ అల్ అధా వేడుకలు ప్రారంభం
- భవనాలలో అత్యవసర ఎగ్జిట్ మార్గాలు.. ప్రతిపాదనకు ఆమోదం
- ‘లులూ లెట్స్ కనెక్ట్’ స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు
- ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన సుల్తాన్
- మంత్రిగా నారాయణ బాధ్యతలు స్వీకరణ..
- యూఏఈలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ఈ ఏడాది హజ్ చేసిన 1.83 మిలియన్ల మంది యాత్రికులు
- G7 సమ్మిట్.. UK ప్రధానిని కలిసిన యూఏఈ అధ్యక్షుడు