నిరాహార దీక్షకు రెడీఅవుతున్న కన్నడ హీరో ఉపేంద్ర
- August 13, 2019
బెంగుళూరు:ఉపేంద్ర.. కన్నడ స్టార్ హీరో ! ఒకవైపు సినిమాలు చేస్తూనే.. రాజకీయాల్లో కూడా యాక్టీవ్‌గా ఉంటారు. అప్పుడప్పుడు సమస్యలపై స్పందిస్తారు. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ స్టార్ హీరో సడన్‌గా నిహారాదీక్షకు పూనుకున్నారు. కారణం.. నిరుద్యోగ సమస్య.
బెంగుళూరుకు దేశ ఐటీ రాజధానిగా పేరు. ఉపాధి కోసం ఇక్కడికి అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున యువత వస్తున్నారు. దీంతో స్థానికంగా ఉన్నవారికి ఉద్యోగాలు లేకుండా పోతున్నాయన్న వాదన ఉంది. అందుకే స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలన్న డిమాండ్‌తో పోరాటం చేయబోతున్నారు ఉపేంద్ర. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ లోకల్ నినాదం బలంగా వినిపిస్తోంది. స్థానికంగా వున్న యువతకే 75 శాతం ఉద్యోగాలు కల్పించాలన్న డిమాండ్ క్రమంగా ఊపందుకుంటోంది.
ఇప్పుడు ఇదే విషయంపై ఉపేంద్ర కూడా గళం విప్పారు. ఈ నెల 14, 15 తేదీల్లో నిరాహారదీక్ష చేయబోతున్నట్టు ప్రకటించారు. తన పోరాటానికి కర్నాటక యువత మద్దతుగా నిలవాలని కోరారు. కొన్నాళ్లు పాలిటిక్స్‌పై సీరియస్‌గా ఫోకస్ చేసిన ఉపేంద్ర.. తాజాగా ఈ లోకల్ డిమాండ్‌తో ప్రజలకు చేరువవ్వాలని భావిస్తున్నారు. గతేడాదే రాజకీయాల్లోకి వచ్చిన ఉపేంద్ర..సొంతంగా పార్టీ కూడా పెట్టారు. ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ ప్రజా మద్దతు సాధించడంలో విఫలమయ్యారు. ఐనప్పటికీ రాష్ట్ర సమస్యలపై అప్పుడప్పుడు గళం వినిపిస్తూనే ఉన్నారు. గత నెలలో ఏర్పడిన రాజకీయ సంక్షోభంపైనా స్పందించారు. రాష్ట్రంలో పేరుకుపోయిన అవినీతి గురించి మాట్లాడారు. ఇప్పుడు లోకల్ స్లోగన్ అందుకున్నారు. ఉపేంద్ర వేసిన ఈ కొత్త ఎత్తుగడ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







