వరద బాధితులకు తనవంతు సాయం చేసిన సంపూర్ణేష్ బాబు.!
- August 13, 2019
సంపూర్ణేష్ బాబు హృదయ కాలేయం చిత్రంతో కామెడీ హీరోగా మారాడు. ఒకప్పుడు సంపూర్ణేష్ బాబుపై కామెడీ స్పూఫ్ లు చేసే హీరో అంటూ సెటైర్లు పడ్డాయి. కానీ ఇప్పుడు సంపూర్ణేష్ నటించిన సినిమాలు చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. సంపూర్ణేష్ బాబు బర్నింగ్ స్టార్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.
సంపూర్ణేష్ బాబు స్టార్ హీరో కాకపోవచ్చు.. అతడి సినిమాలు వందల కోట్ల బిజినెస్ చేయకపోవచ్చు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో, సాయం అందించడంలో పెద్ద మనసున్న హీరో అని సంపూర్ణేష్ మరోసారి నిరూపించుకున్నాడు. కర్ణాటకలో వరద బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే 48మంది ప్రాణాలు కోల్పోయారు. ఎందరో నిరాశ్రయులుగా మారారు.
కేంద్ర, రాష్ట్ర సహాయ బృందాలు సాయం అందించేందుకు చర్యలు చేపడుతున్నాయి. కన్నడ, బాలీవుడ్ సినీ తారలు వరద బాధితుల్ని ఆదుకునేందుకు తమకు తోచిన విధంగా విరాళాలు అందిస్తున్నారు. టాలీవుడ్ నుంచి సంపూర్ణేష్ బాబు కర్ణాటక ముఖ్యమంత్రి సహాయ నిధికి 2 లక్షల విరాళాన్ని ప్రకటించాడు.
కర్ణాటకలో వరదలు నన్ను కలచివేశాయి. కర్ణాటక ప్రజలు తెలుగు సినిమాని ఎప్పటినుంచో ఆదరిస్తున్నారు. నా చిత్రాలని కూడా వారు ప్రేమిస్తున్నారు. 2 లక్షలు వరద బాధితులకు సాయం ప్రకటిస్తున్నా అని సంపూర్ణేష్ ట్వీట్ చేశాడు. గతంలో తిత్లీ తుఫాను సమయంలో కూడా సంపూర్ణేష్ 50 వేలు విరాళం అందించాడు. సంపూర్ణేష్ నటించిన కొబ్బరి మట్ట చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది.
కర్ణాటకలో వరదలకు దాదాపు 3వేల గ్రామాలు నీట మునిగాయి. 40 వేలకు పైగా ఇల్లు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, కేరళలో కూడా వరదలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..