ఎల్‌ఐసీ కొత్త పాలసీ.. తక్కువ ప్రీమియం

ఎల్‌ఐసీ కొత్త పాలసీ.. తక్కువ ప్రీమియం

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఎల్‌ఐసీ) కొత్త టర్మ్ పాలసీ జీవన్ అమర్‌ను తీసుకు వచ్చింది. పాలసీదారులకు పూర్తిస్థాయి భద్రత లభిస్తుందని ఎల్‌ఐసీ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు రకాల ఆప్షన్స్‌లో పాలసీని అందుబాటులోకి తెచ్చింది. లెవల్ సమ్ అస్యూర్డ్, ఇంక్రీజింగ్ సమ్ అస్యూర్డ్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. స్మోకర్స్, నాన్ స్మోకర్స్ అని రెండు కేటగిరీలు ఉన్నాయి. 18 నుంచి 64 ఏళ్ల లోపు వయస్సు కలిగిన వారు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. 10 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు పాలసీ కాల పరిమితిని ఎంచుకోవచ్చు. కనిష్టంగా రూ.25 లక్షలు.. గరిష్ట పరిమితి లేదు. ఎంతైనా తీసుకోవచ్చు. మహిళలకు పురుషుల కంటే తక్కువ ప్రీమియం రేట్లు ఉన్నాయి.

ఇక ఈ పాలసీ తీసుకున్న వారు సింగిల్, రెగ్యులర్, లిమిటెడ్ ప్రీమియం పేమెంట్స్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. డెత్ బెనిఫిట్స్‌ విషయంలోనూ ఆప్షన్స్ ఉన్నాయి. మొత్తం డబ్బు ఒకేసారి తీసుకుంటారా లేక వాయిదాలలో తీసుకుంటారా అనేది ఎంచుకోవచ్చు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఈ పాలసీని తీసుకువచ్చినట్లు ఎల్‌ఐసీ తెలిపింది. పూర్తి జీవితానికి రక్షణ కల్పించే ఈ ప్లాన్ పాలసీదారులకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. తక్కువ ధరలో మరణానంతరం కుటుంబానికి రక్షణ కల్పించే ఈ ప్లాన్ పైన అమల్లో ఉన్న పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు ఉంటాయని తెలిపింది. ప్రమాద బీమాకు అదనంగా కవరేజి ఉంది.మరిన్ని వివరాలకు ఈ నెంబర్ 00919949322175 కి కాల్ చెయ్యగలరు.

Back to Top