మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ తెలిపిన రామ్ చరణ్
- August 13, 2019
రామ్ చరణ్ ఎప్పటికప్పుడు చిత్ర యూనిట్ తో మాట్లాడుతూ సినిమా పనులన్నీ వీలైనంత త్వరగా అయిపోవాలని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇకపోతే సినిమాకు సంబందించిన ఒక స్పెషల్ మేకింగ్ వీడియోను అభిమానులకు అందించబోతున్నాడు చరణ్. గత కొంత కాలంగా మెగా అభిమానులు సైరా అప్డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
మొత్తానికి వారిని ఎట్రాక్ట్ చేసే విధంగా చరణ్ సైరా మేకింగ్ వీడియోను ఆగస్ట్ 15 కంటే ఒక రోజు ముందే బుధవారం (సమయం 3:45PM) రిలీజ్ చేయబోతున్నాడు. రెండేళ్లు చిత్ర యూనిట్ సినిమా కోసం కష్టపడిన దృశాలను చూడవచ్చని ఇదొక గొప్ప అనుభూతి అని చరణ్ పేర్కొన్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన సైరా కొణిదెల ప్రొడక్షన్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అమితాబ్ - సుదీప్ - విజయ్ సేతుపతి వంటి స్టార్ యాక్టర్స్ నటించిన ఈ సినిమాలో నయనతార మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







