చంద్రయాన్ -2 ఆగస్టు 20 న చంద్రుని కక్ష్యకు చేరుకోనుంది
- August 14, 2019
ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ -2 వ్యోమనౌక… చంద్రుడి వైపు వేగంగా దూసుకెళ్తోంది. ఇవాళ తెల్లవారుజామున చేపట్టిన కీలకమైన ప్రక్రియ ద్వారా ఇది పూర్తి స్థాయిలో భూ కక్ష్యను విడిచిపెట్టింది. ప్రయోగం చేపట్టిన 23 రోజుల తర్వాత ఈ కీలకమైన ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేశారు ఇస్రో శాస్త్రవేత్తుల. ఈ ప్రక్రియ సక్సెస్ కావడంతో … ఇస్రో సైంటిస్టులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో ఇది చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. అనంతరం సుదీర్ఘ ప్రయాణం తర్వాత సెప్టెంబర్ 7వ తేదీన జాబిల్లి ఉపరితలంపై కాలుమోపనుంది
గత నెల 22న శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ప్రయోగించిన 3850 కిలోల బరువుండే చంద్రయాన్-2 వ్యోమనౌకలో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఉన్నాయి. చంద్రయాన్-2 ప్రయోగం తర్వాత ఐదుసార్లు కక్ష్య పెంచినట్లు ఇస్రో ఛైర్మన్ కె.శివన్ తెలిపారు. ఇవాళ భూకక్ష్యనుంచి విడిపోయిందని, ఆ తర్వాత లూనార్ ఆర్బిట్ ఇన్సర్షన్ ప్రక్రియ చేపట్టడం ద్వారా చంద్రయాన్-2 చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. మరికొన్ని ప్రక్రియలు చేపట్టిన తర్వాత సెప్టెంబర్ 7న చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధ్రువానికి సమీపంలో వ్యోమనౌక ల్యాండ్ అవుతుందన్నారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







