ఎల్‌ఐసీ పాలసీతో ఎన్నో ప్రయోజనాలు..

ఎల్‌ఐసీ పాలసీతో ఎన్నో ప్రయోజనాలు..

లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తీసుకునే ఉంటారు. మూడు నెలలకో, ఆరు నెలలకో ప్రీమియం కట్టేస్తుంటారు. పాలసీ గడువు ముగిసే వరకు వాటి గురించి ఆలోచించరు. అయితే ఈ పాలసీలతో ఐదు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.. పెన్షన్, టర్మ్, హెల్త్, ఎండోమెంట్, మనీ బ్యాక్ వంటి పాలసీల వల్ల పన్ను ప్రయోజనాలు పొందొచ్చు.
ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్‌లోని సెక్షన్ 80 సీ కింద లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి చెల్లించే ప్రీమియం మొత్తాన్ని ఆదాయపు పన్ను నుంచి డిడక్షన్ పొందొచ్చు. అదే అవిభాజ్య కుటుంబంలో ఎవరైనా పాలసీ తీసుకుంటే ప్రీమియం మొత్తంలో 20 శాతం పన్ను మినహాయింపుకు అవకాశం ఉంది. జీవన్ నిధి ప్లాన్, జీవన్ సురక్ష ప్లాన్ వంటి పెన్షన్ అందించే యాన్యుటీ ప్లాన్లపై పన్ను ఆదాయం నుంచి డిపాజిట్ చేసిన మొత్తం సెక్షన్ 80 సీసీసీ కింద డిడక్షన్ పొందొచ్చు. పన్ను చెల్లింపుదారులు తన పేరుపై లేదా పిల్లలు, భార్య పేరుపై హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే దీనిపై కూడా సెక్షన్ 80 డీ కింద రూ.25,000 డిడక్ష‌న్ పొందే అవకాశం ఉంది. సీనియర్ సిటిజన్ పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే.. అప్పుడు రూ. 25,000 డిడక్షన్ రూ.30,000 వరకు పెరుగుతుంది. తల్లిదండ్రులకు పాలసీ తీసుకుని ఉంటే అదనంగా రూ.25,000 వరకు డిడక్షన్ పొందొచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10 (10ఏ) (3) ప్రకారం.. జీవన్ సురక్ష, జీవన్ నిధి యాన్యుటీ ప్లాన్స్ నుంచి పొందిన పెన్షన్ మొత్తంపై పన్ను మినహాయింపు ఉంది. సెక్షన్ 80డీడీ కింద జీవన్ ఆధార్ ప్లాన్, జీవన్ విశ్వాస్ ప్లాన్ కలిగిన వారికి పన్ను ప్రయోజనం ఉంటుంది.మరిన్ని వివరాలకు ఈ మొబైల్ నెంబర్ 00919949322175 కి కాల్ చెయ్యగలరు. 

Back to Top