చంద్రబాబు నాయుడు భద్రతపై హైకోర్టు కీలక తీర్పు
- August 14, 2019
టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. చంద్రబాబుకు మొత్తం 97 మంది భద్రతాసిబ్బందిని కొనసాగించాలని ఆదేశించింది. సీఎస్ఓను ప్రభుత్వం నియమించవచ్చని పేర్కొంది. దీంతో పాటు ఆయన కాన్వాయ్ లో జామర్ ఇవ్వాలనీ ఆదేశాలు జారీ చేసింది. క్లోజ్డ్ ప్రొటెక్షన్ టీమ్ విధులు ఎవరు నిర్వహించాలనే విషయంలో ఎన్ఎస్జీ, ఐఎస్ డబ్లూ కలిసి చర్చించుకోవాలని, మూడు నెలల్లోగా ఓ నిర్ణయం తీసుకుని చంద్రబాబుకు 5 ప్లస్ 2 భద్రత ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు భద్రతను భారీగా తగ్గించింది. అయితే ఉద్దేశపూర్వకంగానే తనకు భద్రత తగ్గించారంటూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ పై బుధవారం హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఇరువాదనలు విన్న హైకోర్టు తీర్పు వెల్లడించింది.
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ఒక సీఎస్ వోనే కొనసాగించాలని స్పష్టం చేసింది. కాన్వాయ్‌లో జామర్ ఇవ్వాలని కూడా ఆదేశించింది. అయితే క్లోజ్ ప్రొటెక్షన్ టీం విధుల నిర్వహణ తాము చూడలేమని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఏకీభవించిన హైకోర్టు చంద్రబాబు క్లోజ్ ప్రొటెక్షన్ టీం విధులు ఎవరు నిర్వహించాలనే అంశంలో ఎన్ఎస్‌జీ, ఐఎస్‌డబ్ల్యూ కలిసి చర్చించుకోవాలని తెలిపింది.
చంద్రబాబు భద్రత అంశంపై మూడు నెలల్లోగా రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. చంద్రబాబుకు ప్రస్తుతం 74 మందితో భద్రత కల్పిస్తోంది ఏపీ ప్రభుత్వం. తాజా కోర్టు తీర్పుతో ఆ సంఖ్య 97కు పెరగనుంది. దీంతో టీడీపీ వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







