రాయల్‌ ఫ్యామిలీ ఛాలెట్‌లోకి వెళ్ళిన వ్యక్తి అరెస్ట్‌

రాయల్‌ ఫ్యామిలీ ఛాలెట్‌లోకి వెళ్ళిన వ్యక్తి అరెస్ట్‌

కువైట్‌: రూలింగ్‌ ఫ్యామిలీకి చెందిన ఛాలెట్‌లోకి ప్రవేశించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. విచారణలో నిందితుడ్ని పోలీసులు ఎంత ప్రశ్నించినా సమాధానం చెప్పడంలేదు. ఐడీ కార్డ్‌ని చూపించమని అడగగా 'నేను నిద్రపోతాను' అని మాత్రమే చెబుతున్నాడు.రాయల్‌ ఛాలెట్‌లోకి కిచెన్‌ డోర్‌ ద్వారా నిందితుడు ప్రవేశించినట్లు పోలీస్‌ అధికారులు పేర్కొన్నారు. రాత్రికి అక్కడే రెస్ట్‌ తీసుకుని, ఉదయాన్నే వెళ్ళిపోదామనుకున్నట్లు నిందితుడు చెబుతున్నాడు. ప్రైవేట్‌ ప్రాపర్టీలోకి అనుమతి లేకుండా ప్రవేశించాడన్న కోణంలో నిందితుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. 

--షేక్ బాషా(కువైట్)

Back to Top