ఒమాన్ " ఇ - 44" మార్గంలో ఇక విదేశీయులకు అనుమతి లేదు

- January 07, 2016 , by Maagulf
ఒమాన్

 ఎమరేట్స్ నుంచి భూమార్గం ద్వారా ఒమాన్ చేరేందుకు ఫీజులను క్రమబద్దీకరించారు. దీని   ప్రకారం ఒక వ్యక్తికి 30  దినార్లు ఖర్చుగా నిర్ణయించారు. ఈ మార్గంలో గల్ఫ్ దేశాల సమఖ్యకు చెందిన జాతీయులు ఈ రహదారి మీదుగా తమ తమ ప్రయాణాలను కొనసాగించవచ్చు. 

 అయితే , ఇదే మార్గంలో ప్రయాణించే  విదేశీయులకు అనుమతి లేదు. ఈ దారి ఒమాన్  సరిహద్దు  ప్రాంతమైన మాదం మరియు హత్తాకు చేరుతుంది. ఈ మార్గానికి ప్రత్యామ్నయంగా షార్జా  కల్బ మీదుగా హత్తాకు చేరుకోవచ్చు. ఈ మార్గంలో ఎటువంటి ఇబ్బంది ఉండదని అధికారులు తెలియచేస్తున్నారు. తమ సూచనను  కాదని , మాదం దారి మీదుగా విదేశీయులు ఎవరైనా ప్రయాణిస్తే, చెక్ పోస్ట్ వద్ద ఒమాన్ అథారిటీ సిబ్బంది నిర్దయగా ఆపివేయబడి , తిరిగి వెనక్కి పంపివేయబడతారని తెలిపారు. షార్జా  కల్బ ప్రాంతాలకు చేరుకోవడానికి మరో దారి ఏమిటంటే, ఆ మాదం మార్గంలో ఎడమ వైపునకు తిరిగి " ఇ - 55 " మార్గం ద్వారా ' అల్ మలైహ ' మీదుగా  ముందుకు ప్రయాణించిన తర్వాత ' శావ్క ' మార్గ సూచీ బొర్దును గమనించవచ్చు. అక్కడ కుడి వైపునకు తిరిగి  హత్తా 44  ద్వారా , 25 నుంచి 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించి "  ఆల్ వజజహ్ "  సరిహద్దుకు చేరుకోవచ్చు. ఇది దాదాపు అరగంట ప్రయాణ భారమైనా మంచిది. ఎందుకంటే, అనుమతి లేని ' మాదం మరియు హత్తాకు ' 2 గంటల 45 నిమిషాలు ఏకధాటిగా ప్రయాణించి అక్కడ సరిహద్దు సిబ్బంది  వెనక్కి పంపడం కన్నా  హత్తా 44  ద్వారా గమ్యం చేరుకోవడం మంచిదని  అధికారులు వివరిస్తున్నారు. సెలవులలో, వారాంతంలో అత్యధిక విదేశీయులు ఒమాన్ లో అక్రమంగా  జరుగుతున్న ప్రవేశాలను నిలువరించేందుకు ఈ చర్యలను తీసుకుంటనట్లు వారు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com