'సైమా అవార్డ్స్ 2019': తెలుగు ఉత్తమ నటుడు,ఉత్తమ నటి వివరాలు
- August 16, 2019
ఖతర్:సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక ఖతార్ లోని దోహా లో నిన్న గ్రాండ్ గా ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరుగన్న ఈ వేడుకకు తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ భాషలకు చెందిన ప్రముఖులు హాజరైయ్యారు. కాగా టాలీవుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవి ఈ మెగా ఈవెంట్ కు ముఖ్య అతిధిగా హాజరైయ్యారు.
ఇక సైమా తెలుగు ఉత్తమ నటుడు విభాగంలో రంగస్థలం సినిమా కు గాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైమా అవార్డును గెలుచుకున్నాడు. అయితే ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో చరణ్ బిజీ గా ఉండడంతో ఆయన తరుపున చిరంజీవి ఆ అవార్డును తీసుకున్నారు. కాగా ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో చరణ్ కు ఉత్తమ నటుడు అవార్డు దక్కకపోవడంతో నిరాశ చెందిన మెగా ఫ్యాన్స్ కు తాజా అవార్డు ఊరటనిచ్చింది.
తెలుగు ఉత్తమ నటి విభాగంలో మహానటి సినిమాకు గాను కీర్తి సురేష్ అవార్డును గెలుచుకుంది. ఇటీవల కేంద్రం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఉత్తమ జాతీయ నటి గా అవార్డు గెలుచుకొని అందరి ప్రశంసలు అందుకున్న కీర్తి .. తాజాగా సైమా రూపంలో మరో ప్రతిష్టాత్మక అవార్డును ఖాతాలో వేసుకుంది. ఇక ఉత్తమ కన్నడ నటుడుగా యష్ సైమా అవార్డును గెలుచుకున్నాడు. కెజిఎఫ్ చిత్రానికి కి గాను యష్ కు అవార్డు వరించింది.
సైమా 2019 విజేతలు (తెలుగు):
ఉత్తమ నటుడు - రామ్ చరణ్ (రంగస్థలం )
ఉత్తమ నటి - కీర్తి సురేష్ (మహానటి)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - విజయ్ దేవరకొండ (గీత గోవిందం )
సోషల్ మీడియా సూపర్ స్టార్ - విజయ్ దేవరకొండ
ఉత్తమ సంగీత దర్శకుడు - దేవి శ్రీ ప్రసాద్ ( రంగస్థలం )
(గమనిక : ఇది సైమా అవార్డ్స్ విజేతల పూర్తి లిస్ట్ కాదు .. )
-- రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతర్)












తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







