ఎయిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
- August 18, 2019
ఢిల్లీ : ఢిల్లీ ఎయిమ్స్‌లో శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో రోగులు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలు అదుపుచేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఆస్పత్రి వద్ద పొగలు వ్యాపించడంతో అంతా భయంతో పరుగులు తీశారు. ఎమర్జెన్సీ వార్డు సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఏడు నుంచి ఎనిమిది ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకోగా.. సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. తొలి అంతస్తులో ప్రమాదం జరగ్గా.. రెండో అంతస్తు దాకా పొగలు వ్యాపించాయి. బిజెపి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఎయిమ్స్‌లోనే చికిత్స పొందుతున్నప్పటికీ.. ఆయన వేరే భవనంలో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..