ఆగస్టు 23 న యూ.ఏ.ఈ విచ్చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ
- August 18, 2019
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 23-24 తేదీల్లో యూఏఈ మరియు ఆగస్టు 24-25 తేదీల్లో బహ్రెయిన్ కు విచ్చేయనున్నట్లు తెలిపిన భారత విదేశాంగ మంత్రి.
యూఏఈ పర్యటన లో భాగంగా అబుధాబి క్రౌన్ ప్రిన్స్ మరియు యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ను కలవనున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు పెద్దపీట వేస్తూ మోడీ విశిష్ట నాయకత్వానికి గుర్తింపుగా యూఏఈ యొక్క అత్యున్నత పౌర అలంకరణ అయిన 'ఆర్డర్ ఆఫ్ జాయెద్' ను కూడా మోడీ అందుకుంటారు. యూఏఈ వ్యవస్థాపక తండ్రి షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ పేరిట ఈ అవార్డు షేక్ జాయెద్ పుట్టిన శతాబ్ది సంవత్సరంలో మోడీకి లభించినందున ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది.బహ్రెయిన్ లో పర్యటించనున్న మొట్టమొదటి భారత ప్రధానిగా మోడీ చరిత్రలో నిలవనున్నారు.
--సుమన్ (మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







