6-11 తరగతి విద్యార్థుల ప్రతిభకు పరీక్ష ‘విద్యార్థి విజ్ఞాన మంథన్’..

- August 19, 2019 , by Maagulf
6-11 తరగతి విద్యార్థుల ప్రతిభకు పరీక్ష ‘విద్యార్థి విజ్ఞాన మంథన్’..

భారత దేశంలోని అన్ని పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి 11వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ‘విద్యార్థి విజ్ఞాన మంథన్’ పోటీ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకునే గడువు సెప్టెంబర్ 15వ తేదీతో ముగుస్తుంది. ప్రతియేటా ఆన్‌లైన్‌లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. పాఠశాల, జిల్లా, రాష్ట్ర జాతీయ స్థాయిల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు www.vvm.org.in వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నవంబర్ 4 లేదా 30 వ తేదీల్లో పరీక్షల నిర్వహణ ఉంటుంది. డిసెంబర్ 15న ఫలితాలు వెలువడతాయి. విద్యార్థులకు ఆరో తరగతి నుంచే సైన్స్, లెక్కల పట్ల ఆసక్తి కలిగిస్తే ఉన్నత చదువుల్లో రాణించి దేశ పురోగతికి పాటుపడుతారన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పరీక్షను నిర్వహిస్తోంది. విద్యార్థులు పరీక్ష రాయదలచుకుంటే ఉపాధ్యాయుల సాయంతో వెబ్‌సైట్‌లో సిలబస్ సహా అన్ని వివరాలను తెలుసుకోవాలి. ఈ పోటీ పరీక్షలపై విద్యార్థులకు ఉపాధ్యాయులు తగిన సూచనలు, సలహాలు చేయాలి. ‘విద్యార్థులు విద్యార్థి విజ్ఞాన’ మంథన్ పోటీ పరీక్షలో పాల్గొనేలా ప్రోత్సహించాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com