బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆత్మహత్య యత్నం
- August 19, 2019
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 చాలా స్మూత్‌గా ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతోంది. ఇదే సమయంలో తమిళ బిగ్‌బాస్ గురించి మాత్రం మొదటి నుండి ఏదో ఒక విమర్శ వస్తూనే ఉంది. ఇప్పటికే ఒక కంటెస్టెంట్‌ను అర్థాంతరంగా బయటకు పంపించిన బిగ్‌బాస్ నిర్వాహకులు తాజాగా నటి మధుమిత చేసిన పనికి ఆమెను అర్థాంతరంగా బయటకు పంపించినట్లుగా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మధుమిత ఇప్పటికే 50 రోజుల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో ఉంది.
తమిళ బిగ్‌బాస్ హౌస్‌లో కొందరు ఈమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేయడంతో పాటు, ఒక ఆట ఆడుకోవడం జరిగిందట. దాంతో ఆమె ఒత్తిడికి ఏకంగా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించినట్లుగా సమాచారం అందుతోంది. వెంటనే ఆమెను కాపాడిన ఇంటి సభ్యులు మరియు నిర్వాహకులు ఆమెను బయటకు పంపించినట్లుగా సమాచారం అందుతోంది. బయటకు వచ్చిన తర్వాత ఆమె మాట్లాడుతూ హౌస్ మేట్స్ నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..