ఫుడ్ సేఫ్టీ చట్టానికి ఖలీఫా ఆమోదం
- January 07, 2016
ఫుడ్ సేఫ్టీ చట్టానికి ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆమోదం తెలిపారు. జులై 1 నుంచి ఈ చట్టం అమల్లోకి రానుంది. ఈ చట్ట ప్రకారం ఫుడ్ సేఫ్టీ నిబంధనల్ని ఉల్లంఘించినవారికి మూడేళ్ళ వరకు జైలు శిక్ష మరియు 2 మిలియన్ దిర్హామ్‌ల ఫైన్ విధించబడ్తుంది. ఫెడరల్ కౌన్సిల్‌లో గత సంవత్సరం పాస్ అయిన ఈ శాసనం, పబ్లిక్ హెల్త్ కోసం ఉద్దేశించబడినది. నిబంధనలకు విరుద్ధంగా తయారవుతున్న ఆహార పదార్థాల కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడ్తున్నారనీ, అలాగే మరణాలు కూడా సంభవిస్తున్నాయనీ, ఈ నేపథ్యంలోనే ఈ చట్టాన్ని తెచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. యూఏఈ 80 శాతం ఆహార పదార్థాల్ని ఇంపోర్ట్ చేసుకుంటోంది. దాంతో, ఇంపోర్ట్ అవుతున్న ఆహార పదార్థాలు నిబంధనలకు అనుగుణంగా మాత్రమే తయారవ్వాల్సి ఉంది. గత సంవత్సరం 10 మిలియన్ టన్నుల ఆహార పదార్థాలు ఇంపోర్ట్ అవగా కేవలం 3 శాతం మాత్రమే తిరస్కరణకు గురయ్యానీ, అవి కూడా లేబెలింగ్ సమస్య కారణంగానేనని ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ మినిస్టర్ డాక్టర్ రషీద్ అహ్మద్ బిన్ ఫహాద్ చెప్పారు. చట్టంలో పేర్కొనబడ్డ ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ పర్మిషన్ లేకుండా కొత్తగా ఎలాంటి ఆహార పదార్థాల దిగుమతిని అనుమతించరు. పోర్క్ లేదా ఆల్కహాల్ కలిగి ఉన్న ఆహార పదార్థాలు అనుమతి లేకుండా ఇంపోర్ట్ చేసినట్లయితే ఒక నెల జైలు శిక్ష, 500,000 దిర్హామ్‌ల ఫైన్ విధిస్తారు. ఆహార పదార్థాల ప్యాకేజింగ్‌పై తప్పుడు వివరాలు ఉంటే 10,000 నుంచి 100,000 దిర్హామ్‌ల ఫైన్ విధించబడ్తుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









