మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు: మెగా హీరోస్ అందరు ఒకే వేదికపై
- August 19, 2019
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు మెగా ఫ్యాన్స్ కి పెద్ద పండగ అని చెప్పాలి. అన్నయ్య బర్త్ డే అంటే కొన్ని లక్షల మంది తమ్ముళ్ళు సంబరాలు జరుపుకుంటారు. అందుకే అన్నయ్య బర్త్ డే రోజైన ఆగస్ట్ 22 ఈసారి చాలా స్పెషల్ గా నిలవబోతోంది. రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న విజువల్ అండ్ హిస్టారికల్ వండర్ సైరా విడుదలకు సిద్ధంగా ఉండటం రెండు రోజుల ముందే టీజర్ రెడీ కావడం చిరు బర్త్ డే ని మరింత స్పెషల్ గా మార్చేశాయి. ప్రతి ఏడాది లాగే గ్రాండ్ గా జరిగే తన పబ్లిక్ బర్త్ డే సెలబ్రేషన్లకు చిరు దూరంగా ఉండబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. అలా అని ఫ్యాన్స్ ని మాత్రం నిరుత్సాహపడనివ్వడంలేదు. అందుకే మెగా హీరోలందరూ మెగా ఫ్యాన్స్ కి పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారని లేటెస్ట్ న్యూస్.
శిల్పకళా వేదికగా జరగబోయే ఈవెంట్ లో అతిథులుగా మెగా కాంపౌండ్ హీరోలందరూ వస్తున్నారని తాజా సమాచారం. నిజంగా ఇది ఎంతో ఆసక్తికరమైన అంశం. చాలా ఏళ్ళ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా రాబోతున్నట్టుగా హాట్ న్యూస్ ఒకటి ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. అంతే కాదు రామ్ చరణ్ - అల్లు అర్జున్ - వరుణ్ తేజ్ - సాయి తేజ్ లతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు ఇతర సెలెబ్రిటీలు కూడా వస్తారట. ఇది ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ కు మెగా గిఫ్ట్ అని చెప్పుకుంటున్నారు.
ఎందుకంటే రంగస్థలం సక్సెస్ మీట్ తర్వాత పవన్, చరణ్ ఒకే స్టేజి మీద కనిపించలేదు. నా పేరు సూర్య ఈవెంట్ తర్వాత బన్నీ, పవన్ లు కూడా కలిసి ఒకే వేదికను షేర్ చేసుకోలేదు. ఇక ఇప్పుడు ఈ ముగ్గురు వస్తున్నారంటే అంతకంటే అభిమానులకు కావాల్సింది ఏముంది. అంతేకాదు వీటితో పాటు మరికొన్ని స్పెషల్ సర్ప్రైజెస్ కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. చిరు రాకపోయినా ఆ లోటు తెలియకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు తెస్తున్నట్టుగా మెగా కాంపౌండ్ న్యూస్. మొత్తానికి 22న జరగబోయే మెగా ఈవెంట్ కు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో తెలియబోతున్నాయి.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







